‘చిత్రపటం’ టాకీ పార్ట్ పూర్తయింది

Chitrapatam Movie Takie Part Completed

కవి ఫిల్మ్ సిటీ సమర్పణలో, శ్రీ క్రియేషన్స్ పతాకంపై పార్వతీశం(నూకరాజు), శ్రీవల్లి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు బండారు దానయ్య కవి దర్శకత్వంలో, పుప్పాల శ్రీధర్ రావు నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చిత్రపటం’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పార్టు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ.. ‘‘విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యూత్ & ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం. కోట శ్రీనివాసరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే పోసాని, శరణ్యగారు, నారెన్, బాహుబలి ప్రభాకర్ వంటి సీనియర్ ఆర్టిస్టులందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలతో, యూత్‌ని ఆకట్టుకునే సంగీతంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అలాగే…