*నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ‘బ్యాండ్ మేళం’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ సినిమాకి మంచి విజయం దక్కింది. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 26న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు బ్యాండ్ మేళం జాయ్ ఫుల్ బ్లాక్ బస్టర్ థాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘చెన్నై బీచ్‌లో ఓ సారి కాళ్లు, చేతులు లేని ఓ అమ్మాయి బెలూన్స్ అమ్ముకుంటూ కనిపించింది. ఆ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలని…
