రేపటి నుండి అనంతపురంలో ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ !

balakrishna in veerasimhareddy

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన సంగీత సంచలనం ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్…