నటులు కల్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన చిత్రం ’అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. తల్లి కొడుకుల అనుబంధం, యాక్షన్ ప్రధానంగా సాగిన ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమా ఇటీవల రెంటల్ విధానంలో ప్రముఖ ఓటీటీ- వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన విషయం తెలిసిందే. రెంటల్ రావడంతో సినిమా చూద్దాం అనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. అయితే తాజాగా ఈ సినిమాను రెంటల్ నుంచి తొలగించి ఫ్రీగా అందుబాటులోకి తీసుకోచ్చారు. ప్రైమ్ చందదారులు ఈ సినిమాను ఉచితంగా చూడవచ్చు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వైజయంతి (విజయశాంతి) అనే నిజాయితీగల ఐపీఎస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు అర్జున్…