బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ కొత్త సినిమా బేడియా ట్రైలర్ తాజాగా విడుదలై ఫిల్మ్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. సర్ ప్రైజింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేసింది. ఇండియన్ స్క్రీన్ మీద తొలి క్రియేచర్ కామెడీ జానర్ మూవీగా బేడియాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అమర్ కౌశిక్. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాణ బాధ్యతలు వహించారు. ఈ చిత్ర ట్రైలర్ బాగుందంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్ స్టా ద్వారా ప్రశంసించారు. బాలీవుడ్ స్టార్స్ కత్రీనా కైఫ్, అనుష్క శర్మ, వికీ కౌశల్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ ట్రైలర్ తమకెంతో నచ్చిందని, సినిమా మేకింగ్ క్వాలిటీ వరల్డ్…