‘అనుమాన పక్షి’ కంటెంట్ ఫన్ ఫుల్ గా ఉంది: గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు

'Anumana Pakshi' content is fun-filled: Dil Raju at Gulab Jam song launch event

డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ, రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, చిలకా ప్రొడక్షన్స్ ‘అనుమాన పక్షి’ నుంచి రమణ గోగుల పాడిన గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ పాటని వెటరన్ సింగర్ రమణ గోగుల పాడిన తీరు కట్టిపడేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్…