బాలీవుడ్‌లోనూ అనిరుధ్‌ సరిగమలు!

Anirudh matches in Bollywood too!

ఈ మధ్య కాలంలో సౌత్‌ హీరోలు, దర్శకులు బాలీవుడ్‌ హీరోలు, దర్శకులను మించి పారితోషికం తీసుకుంటున్నారు. హీరోలు, దర్శకులు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ లో అత్యధిక పారితోషికం దక్కించుకుంటున్న సంగీత దర్శకులు కూడా సౌత్‌ వారే కావడం విశేషం. చాలా కాలం నుండి బాలీవుడ్‌ సంగీత దర్శకులతో పోల్చితే రెహమాన్‌ కి అత్యధిక పారితోషికం అందుతోంది. ఇప్పుడు ఆయనకు పోటీగా అనిరుధ్‌ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అనిరుధ్‌ వరుసగా సినిమాలు కమిట్‌ అవుతున్నాడు. సక్సెస్‌ రేటు కూడా భారీగా ఉంది. అందుకే అనిరుధ్‌ ఏకంగా తన పారితోషికంను రూ.10 కోట్లకు పెంచారు అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.దీంతో భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడా..? లేదంటే…