కమెడియన్ ఆలీ మంచి టెస్ట్ వున్న నటుడు. ఆయన నటించే చిత్రాలు ఎంత చూజీగా వుంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన నిర్మాతగా మారి నటించిన చిత్రం కూడా అంతే స్థాయిలో ఆలీ టెస్ట్ కి తగ్గట్టుగానే వుంది. మలయాళంలో మంచి విజయం సాధించిన వికృతి అనే సినిమాని తెలుగులో తన సొంత నిర్మాణ సంస్థలో రీమేక్ చేసి ఆహా ఓ టి టిలో విడుదల చేశారు. అలీ సమర్పణలో అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్, శ్రీ చరణ్ ఆర్. లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం పదండి. కథ: శ్రీనివాసరావు(నరేష్) ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. మూగవాడైన శ్రీనివాస…