అనసూయ టీవీ యాంకర్‌గా ఎంత ఫేమస్ అయిందో.. ప్రస్తుతం సినిమాల్లో ఆమె ఎంచుకున్న పాత్రలతోనూ అంతే పాపులర్ అయింది. ప్రస్తుతం టీవీతోపాటు సినిమాలతోనూ బాగా బిజీగా గడుపుతోంది. క్యారెక్టర్ల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది. ఇక ఆమె ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే! సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌ల వల్ల ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ట్రోలింగ్, మీమ్స్ అంటారా లెక్కలేనన్ని. అయితే వీటిపై పెద్ద దృష్టి పెట్టదు అనసూయ. సమయం వచ్చినప్పుడు మాత్రం దీటుగా సమాధానం చెబుతుంది. తాజాగా మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయింది అనసూయ. ఓ టీవీ ఛానల్‌లో జరిగే అవార్డ్ ఫంక్షన్ లో భాగంగా ఓ పెర్ఫార్మెన్స్ కోసం అనసూయ మహానటి సావిత్రి గెటప్ వేశారు. అంతే కాదు.. జమున, శ్రీదేవి, సౌందర్య లాగా కూడా కనిపించింది. గతంలో…