అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేవ్స్ (WAVES వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్) సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. గురువారం (మే 1) నాడు ముంబైలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో భారత చలన చిత్ర సీమకు సంబంధించిన ప్రముఖులు పాల్గోన్నారు. ఈ ఈవెంట్‌లో చిరంజీవి, అక్షయ్ కుమార్, రజినీకాంత్, మోహన్‌లాల్ వంటి వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో.. చిరంజీవి మాట్లాడుతూ.. ‘బాల్యంలో నేను ఎక్కువగా డ్యాన్సులు చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌ను ఎంటర్టైన్ చేస్తుండేవాడిని. అలా నటనపై నాకు ఆసక్తి మొదలైంది. చివరకు మద్రాసుకి వెళ్లి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. అప్పటికే ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా అర డజనుకు పైగా…