టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో కార్తీక్, సాయికిరణ్, రవి శివతేజ, కాస్ట్యూమ్స్ డిజైనర్ ప్రియాంక వీరబోయిన, ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ నూలే, మ్యూజిక్ డైరెక్టర్ అకీవా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, నేచురల్ స్టార్ నాని విచ్చేశారు. ఈ సందర్భంగా… సాయికిరణ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఫణిదీప్ అండ్ టీమ్‌కి థాంక్స్. మా టీమ్‌ని సపోర్ట్ చేయటానికి వచ్చిన…