అమితాబ్‌ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని అవార్డు ప్రదానం

Akkineni award to Chiranjeevi by Amitabh

* నా గురువు, నా మెంటార్‌, నా స్ఫూర్తిదాత : అమితాబ్‌ బచ్చన్‌పై చిరంజీవి పొగడ్తలు నా గురువు, నా మెంటార్‌, నా స్ఫూర్తిదాత అమితాబ్‌ బచ్చన్‌ అంటూ..ఆయనకు అగ్ర నటుడు మెగాస్టార్‌ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. నాకు ఎప్పుడు ఏ మంచి జరిగినా, నాకు ఎప్పుడైనా అవార్డు వచ్చినా ఆయన నుంచే తొలుతగా నాకు శుభాకాంక్షలు వస్తాయని గుర్తుచేసుకున్నారు. కొన్నిసార్లు ఇలా వచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఆయన లాంటి బిగ్‌ స్టార్‌ నాకు ఈ అవార్డు ప్రదానం చేయడం ఆనందదాయకం అని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఏఎన్నార్‌ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ చేతుల విూదుగా అందుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ క్రమంలో ఏఎన్నార్‌, అమితాబ్‌తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. పద్మ…