‘కాంతార 2’ తరువాత అజనీష్ లోకనాథ్, ‘మార్కో’ తరువాత నిర్మాత షరీఫ్ మహమ్మద్ కలిసి చేస్తున్న మ్యాసీవ్ ప్రాజెక్ట్ ‘కట్టలన్’

After ‘Kantara 2’, Ajaneesh Lokanath and ‘Marco’, producer Sharif Mohammed are working together on a massive project called ‘Kattalan’.

బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మార్కో విజయం తర్వాత క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత షరీఫ్ మహమ్మద్, తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా కట్టలన్ ను అనౌన్స్ చేశారు. ఇది పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ థ్రిల్లర్. ప్రముఖ నటుడు ఆంటోనీ వర్గీస్ (పేపే) హీరోగా నటిస్తున్నారు. దర్శకత్వం పౌల్ జార్జ్. కాంతార 2 కి సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఇప్పుడు షరీఫ్ మహమ్మద్ తో చేతులు కలిపారు. ఈ సినిమాకి సంగీతంతో అజనీష్ మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వర్షంలో తడిచిన పేపే, చుట్టూ పడి ఉన్న మృతదేహాలు, ఏనుగు దంతాల మధ్య నిలబడి వుండటం కథలో ఉండబోయే వైలెన్స్ సూచిస్తోంది. మార్కో స్థాయిని మించి ఉండబోతోందని సంకేతాలు ఇస్తోంది. జైలర్, లియో,…