పండుగ నెల వచ్చేసింది. అందులో దీపావళి ఫెస్టివల్ సందడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలో తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందించటానికి తెలుగువారి హృదయాల్లో చెరగని స్థానాన్ని దక్కించుకున్న మన తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందించటానికి సిద్ధమైంది. అందులో భాగంగా ‘స్వాతి ముత్యం’ సినిమాను ప్రేక్షకులకు అందించనుంది. వెరైటీ ఆఫ్ కంటెంట్‌కు ఆహా వన్ స్టాఫ్‌గా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీస్, షోస్, వెబ్ సిరీస్, ఇతర భాషల నుంచి అనువదించబడ్డ సూపర్ హిట్ కంటెంట్‌లతో తెలుగు ఆడియెన్స్‌ను నిరంతరం ఎంటర్‌టైన్మెంట్‌లో ముంచెత్తుతోంది ఆహా. ఈ లిస్టులో ఇప్పుడు అక్టోబర్ 24న ‘స్వాతి ముత్యం’ సినిమా కూడా చేరనుంది. గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ, రావు రమేష్, సీనియర్ తదితరులు ఇది వరకెన్నడూ లేనంతగా ఆహా ఆడియెన్స్‌ని అలరించటానికి సిద్ధమయ్యారు. స్వాతి ముత్యం…