Actress Anjalali : హీరోయిన్ అంజలి పెళ్లి వార్తల్లో నిజమెంత?!

Actress Anjalali news

నెటిజనులు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు తెగ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాని బాగా వేడెక్కిస్తున్నారు. ఆ పోస్టుల ద్వారా అందర్నీ ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా గ్రామ్, యూ ట్యూబ్.. ఇలా ఒకటా..రెండా ఎన్నో చోట్లా నచ్చిన పోస్టులను బాగా వైరల్ చేసేందుకు సోషల్ మీడియాని వాడేస్తున్నారు. ఇక అసలు విషయానికొద్దాం.. ‘సీతమ్మ’కు సినిమా కష్టాలు మళ్లీ మొదలయ్యాయట. ‘సీతమ్మ’ అంటే మీరు ఎవరో అనుకునేరు! అదేనండీ.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హీరోయిన్ అంజలి. ఇప్పుడు మనం మాట్లాడుకునున్నది కూడా ఆమె గురించే మరి! కథానాయిక అంజలికి పెళ్లైపోయిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా కబురు బాగా వైరల్ కూడా అవుతోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా హీరోయిన్…