ఈ ఏడాది మ‌రిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకు రాబోతోన్నాను : డా. న‌రేష్ విజ‌య‌కృష్ణ‌

Actor Naresh interview

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ వీకే పుట్టిన రోజు (జనవరి 20) సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ గురించి మీడియాతో ముచ్చటించారు. నటుడిగా యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ కెరీర్ గురించి ప్రస్థావించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతుండటంతో.. ఈ ఏడాది నుంచి తన నిర్మాణ సంస్థలో కొత్త సినిమానులను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సంద‌ర్భంగా… న‌రేష్ విజ‌య‌కృష్ణ మాట్లాడుతూ – ‘జనవరి 20 నా పుట్టిన రోజు. నా అభిమానులు, పాత్రికేయ సోదరులు అందరితో కలిసి జరుపుకుంటాను. కానీ రమేష్‌ని మిస్ అవుతున్నాం. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బర్త్ డేను సెలెబ్రేషన్స్ చేసుకోవడం లేదు. నా జీవితంలో జరిగే వాటిని ఇలా పంచుకోవడం సహజం. అందుకే ఇలా కలుస్తాను. 1972లో పండంటి కాపురం సినిమాతో తెరంగేట్రం…