డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. శివా శివా శంకర పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు. విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ కనిపించే ‘సగమై.. చెరిసగమై’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభు దేవా, బృందా…