‘బేబి’ చిత్రంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ కథానాయిక. అను ప్రసాద్ దర్శకుడు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబరు 15న విడుదల కాబోతోంది. సోమవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు మల్లిడి వశిష్ట మాట్లాడుతూ.. “కొత్త డైరెక్టర్ ను నమ్మి సినిమా ఇచ్చిన నిర్మాత నిరీష్ గారికి థాంక్స్. ఈ ఏడాది బేబి చిత్రంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన విరాజ్.. మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. విరాజ్ కి తెలుగు హీరోయిన్స్ బాగా కలిసి వస్తున్నారు.…