ఒక సినీ వారపత్రిక ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తిచేసుకొని, ఇరవయి ఒకటో వసంతంలోకి అడుగుపెట్టడం అది కూడా సెకను సెకనుకు అప్డేట్స్ వస్తున్న ఈ డిజిటల్ యుగంలో అంటే అది చిన్న విషయం ఏ మాత్రం కాదు. ఆగస్ట్ 2వ తేదీతో ‘సంతోషం’కు 21 ఏళ్లు నిండి 22వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ రోజున పరిస్థితులలో పత్రికా నిర్వహణ కత్తిమీద సాము లాంటి వ్యవహారం, న్యూస్ ప్రింట్ ధరలు కొండెక్కి కూర్చున్న కాలంలో ఆర్థికంగా అది అత్యంత కఠిన పరీక్ష, ఈ పరీక్షలను, అవాంతరాలను, గండాలను తట్టుకోలేక ఎన్నో పత్రికలు కనుమరుగయ్యాయి. అయినా కాలానికి ఎదురీదుతూ, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుంటూ ‘సంతోషం’ దిగ్విజయంగా, చిద్విలాసంగా అడుగులు ముందుకేస్తూ వెళుతోంది. సినీ వార పత్రికా రంగంలో ఇది అపురూప సందర్భం! ఈ సందర్బాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి…