ప్రభాస్ మ్యాసీవ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’ జనవరి 3, 2025న జపాన్‌లో షోగాట్సు ఫెస్టివల్ కి విడుదల కానుంది. పరిశ్రమ దిగ్గజం కబాటా కైజో ఆధ్వర్యంలో ట్విన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్న ‘కల్కి 2898 AD’ గ్లోబల్ జర్నీలో మరో అధ్యాయాన్ని నాంది పలుకుతోంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘కల్కి 2898 AD” ఇప్పటికే స్టార్స్‌లో తన స్థానాన్ని పొందింది, ప్రపంచవ్యాప్తంగా ₹ 1200 కోట్లకు పైగా, హిందీ బాక్సాఫీస్ వద్ద ₹ 300 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. డిస్టోపియన్ యూనివర్స్ నుంచి వారియర్ గా భైరవ( ప్రభాస్ ) భారతీయ ఇతిహాసం’మహాభారతం’ నుండి అమరుడైన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రలో విజువల్ వండర్ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్…