కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన 2018 చిత్రం నేడు తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ను రాత్రి హైదరాబాద్, వైజాగ్ మరియు విజయవాడలో ఘనంగా స్టార్ట్ చేసారు. ప్రెస్ స్క్రీనింగ్ మరియు సెలబ్రిటీ ప్రీమియర్ నుండి అనూహ్య స్పందన ఈ సినిమాకి లభించింది. అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడు సెకండాఫ్ లో ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటుంది. అంతేకాకుండా ఆ వరదల్లో ప్రేక్షకుడు చిక్కుకున్నట్లు అనిపించింది దర్శకుడు యొక్క దర్శకత్వ…