నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు మీడియాతో ముచ్చటించారు. సినిమాలో మెమరీ లాస్ అయిన పోలీస్ అధికారిగా నటించారు. యాక్షన్ కొత్తగా ట్రై చేశారు. ‘జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లతో పని చేశారు. ఆ విశేషాలను ఇంటర్వ్యూలతో పంచుకున్నారు. హాయ్ అండీ! ఎవరిని ‘హంట్’ చేయబోతున్నారు? సుధీర్ బాబు : అది మీరు సినిమాలో చూడాలి. ఎవరిని ‘హంట్’ చేస్తున్నానని సస్పెన్స్ సినిమా అంతా ఉంటుంది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త…