నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన, దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 26న విడుదలైన ఈ చిత్రం బోల్డెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రసీమలో50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు డా. నరేష్ వి.కె ను సెలబ్రెటీ వరల్డ్ రికార్డ్ తో సత్కరించారు. సక్సెస్ మీట్ లో డా. నరేష్ వి.కె మాట్లాడుతూ.. ఒక సినీ కుటుంబంలో పుట్టడం, సినిమాల్లోకి రావడం, 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. తన…