‘సర్కారు వారి పాట’ ఓ విజువల్ ట్రీట్ : ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్. ప్రకాష్ ఇంటర్వ్యూ

Art-Director-Prakash-on-Sarkaru-Vaari-Paata-Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ‘సర్కారు వారి పాట’కు పనిచేసిన స్టార్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘సర్కారు వారి పాట’ విశేషాలివి… డైరెక్టర్ పరశురాం గారు ఈ కథ చెప్పాక మీ మొదటి ఫీలింగ్ ఏంటి ? -పరశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్,…