‘విమానం’ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్ ‘రేలా రేలా’ విడుదల

‘విమానం’ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్ ‘రేలా రేలా’ విడుదల

జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ‘విమానం’ విడుదల ఓ చిన్న కుర్రాడు..అత‌నికి విమానం ఎక్కాల‌ని ఎంతో ఆశ‌.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చ‌ర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. తన కోరిక‌ను తండ్రికి చెబితే బాగా చ‌దువుకుంటే విమానం ఎక్క‌వ‌చ్చున‌ని చెబుతాడు. అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే తండ్రి వీర‌య్య ఎలాంటి క‌ష్టం తెలియ‌కుండా త‌ల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మ‌రి ఆ పిల్లాడి కోరిక తీరిందా? తండ్రి చెప్పిన‌ట్లే ఆ పిల్లాడు విమానం ఎక్కాడా? అనే సంగ‌తి తెలుసుకోవాలంటే జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘విమానం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. ‘విమానం’ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని తెలియజేసేలా ‘రేలా రేలా..’ అనే లిరికల్ సాంగ్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిత్ర సంగీత…