ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి ? మాది విజయవాడ. అక్కడే బిటెక్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాను. బిటెక్ లో ఉన్నప్పుడే సినిమాలపై ఆసక్తి వుండేది. హైదరాబాద్ వచ్చాక ప్రయత్నాలు మొదలుపెట్టాను. అయితే…