‘రావణాసుర’లో రవితేజని చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు : నిర్మాత అభిషేక్ నామా

‘రావణాసుర’లో రవితేజని చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు : నిర్మాత అభిషేక్ నామా

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో నిర్మాత అభిషేక్ నామా రావణాసుర విశేషాలని మీడియా సమావేశంలో పంచుకున్నారు. రావణాసురకి కర్త కర్మ క్రియ మీరే అని అందరూ చెబుతున్నారు ? – లేదండీ. అంతా హీరో రవితేజ గారిది.…