యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’ తో వస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. జూలై 7న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకునే సుమగారు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఉండటం ఆనందంగా వుంది. సుధాకర్ గారు, నేను ఎప్పటి నుంచో కలసి సినిమా చేయాలని అనుకున్నాం. పవన్ చెప్పిన కథ మా ఇద్దరికీ నచ్చింది. చేస్తే ఇలాంటి…