వై.ఎస్.జగన్ ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను: ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్ ఈవెంట్‌లో డైరెక్టర్ మహి వి.రాఘవ్ పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతోపాటు సేవ్ ది టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్‌లతోనూ ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు మహి వి.రాఘవ్. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యాత్ర 2’. 3 ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్‌పై ఈ సినిమాను శివ మేక నిర్మిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా శనివారం జరిగిన పాత్రికేయులతో జరిగిన సమావేశంలో… దర్శకుడు మహి వి.రాఘవ్ మాట్లాడుతూ ‘‘కథను ఎంచుకునేటప్పుడు ఓ మేకర్‌గా కమర్షియల్ కోణంలో సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అన్నది ఆలోచిస్తాం. యాత్రలో ఓ రాజకీయ నాయకుడి తన…