‘మేమ్ ఫేమస్’ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది : టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి

Lahari Films and Chai Bisket Films Mem Famous Teaser Unleashed

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్ ,చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. ఇటివలే ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైన మేమ్ ఫేమస్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఒక గ్రామంలోని ముగ్గురు నిర్లక్ష్యపు స్నేహితులు తమ తల్లిదండ్రులు తిడుతున్నప్పటికీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తుంటారు. ఆ ముగ్గురూ ఫేమస్ పదాన్ని తరుచుగా వాడుతుంటారు. వారు ఫేమస్ కాదు ఫేమస్ చేయమని చెబుతుంటారు.…