మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మొదటి సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలవగా, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మరొక ట్రీట్ రెడీ అయ్యింది. ఈ చిత్రం సెకండ్ సింగిల్ ‘జామ్ జామ్ జజ్జనక’ జులై 11న విడుదల కానుంది. ఈ పాట ప్రోమో ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. పోస్టర్ లో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి సూపర్ కూల్ గా కనిపిస్తున్నారు. టైటిల్, పోస్టర్ ఈ పాట మెగా డ్యాన్స్ ట్రీట్ గా ఉండబోతుందని సూచిస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర…