మెగా ప్రిన్స్ వరుణ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ చిత్రం ‘గాండీవధారి అర్జున’ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్‌

మెగా ప్రిన్స్ వరుణ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ చిత్రం ‘గాండీవధారి అర్జున’ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్‌

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేసే యువ కథానాయకుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. VT 12గా గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. గురువారం వ‌రుణ్ తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మోష‌న్ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే మాస్క్ ధ‌రించిన మ‌నుషులు కొంద‌రు ఓ రాజ భ‌వ‌నంలోనికి ప్ర‌వేశించ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి సంద‌ర్భంలో బాంబుల మోత‌, గ‌న్ ఫైరింగ్ న‌డుమ వ‌రుణ్ తేజ్ యాక్ష‌న్ మోడ్‌లో క‌నిపిస్తున్నారు. ఈ మోష‌న్ పోస్ట‌ర్ గ్లింప్స్‌లోనే ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ఇందులో మ‌న మెగా ప్రిన్స్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌గా న‌టిస్తున్నారు. ఎదుటి వారిని…