బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `పోయే ఏనుగు పోయే`. ధమాక, బలగం చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్టర్ పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలోని `ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని ` అనే లిరికల్ వీడియో సాంగ్ ని ఈ రోజు సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ…“మాసివ్ మ్యూజిక్ డైరక్టర్ భీమ్స్ సిసిరోలియో గారు సంగీతాన్ని అందించిన మా చిత్రంలోని ఐటెమ్ లిరికల్ వీడియో ఈ రోజు లాంచ్ చేశాము. శ్రీ సిరాగ్ ఈ…
