మార్చి 16న నాగ చైతన్య ‘కస్టడీ’ టీజర్ విడుదల

మార్చి 16న నాగ చైతన్య 'కస్టడీ' టీజర్ విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి ప్రతి ప్రమోషనల్ కంటెంట్- ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్లు, గ్లింప్స్ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నెల 16న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టీజర్ తేదీని అనౌన్స్ చేయడానికి, ఆసక్తిని పెంచడానికి ఉద్దేశించిన టీజర్ టీజ్ ని విడదల చేశారు. నదిలో జైలు..ఆ జైలు నుంచి తనని తాను విడుపించుకొని బయటికి వస్తున్న నాగచైతన్య వీడియో చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ టీజ్ వీడియోలో నాగచైతన్య ఖాకీ యూనిఫామ్‌లో కనిపించారు. ఈ చిత్రంలో…