వివివి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రుతి ఢాంగే ప్రధాన పాత్రలో, ఎం ఏ చౌదరి దర్శకత్వంలో, కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం “వీరఖడ్గం”. చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి…పగ కూడా అంతే. ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైన సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది, వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ…. వీరఖడ్గం… ఎంతో మంది ప్రావీణ్యం కలిగిన టెక్నీషియన్స్, ఆధునిక సాంకేతికతో ఈ చిత్రాన్ని రూపొందించారు, తమిళ్ పొన్ను శృతి ఢాంగే, తన అందాలతో అలరించింది, సీనియర్ విలక్షణ నటులు సత్యప్రకాష్ , ఆనంద్ రాజ్, తమదైన నటనా శైలి తో మెప్పించారు, నవ్వులు కూడా ఈర్ష్య పడేలా హాస్యామృతాన్ని పంచే హాస్యాబ్రహ్మ బ్రహ్మానందం,…
