లేడీస్ హాస్టల్లో అమ్మాయిని ఎవరో హత్య చేస్తారు.. హంతకుడిగా ఓ యువకుడి (ఆదర్శ్)ని పోలీస్లు అరెస్ట్ చేస్తారు.. హత్యానేరం ఒప్పుకోని యువకుడిని పోలీసులు ఒప్పించటానికి టార్చర్ పెడుతుంటారు. అతని తరపున లాయర్ల వాదించటానికి కేసుని కూడా తీసుకోరు. ఆ సమయంలో ఓ లేడీ లాయర్ (చిత్ర శుక్ల) కేసుని టేకప్ చేసి అతని తరపున నిలుచుకుంటుంది. అసలు లేడీస్ హాస్ట్లో హత్య జరగటం, అందులో యువకుడు అరెస్ట్ కావటం, అతన్ని పోలీసులు టార్చర్ పెట్టటం ఎంటనే విషయాలు తెలుసుకోవాలంటే ‘గీత సాక్షిగా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు అంథోని మట్టిపల్లి, నిర్మాత చేతన్ రాజ్. ‘గీత సాక్షిగా’ చిత్రాన్ని ఆంథోని మట్టిపల్లి స్క్రీన్ప్లే రాసుకుని చక్కగా తెరకెక్కించారు. చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై చేతన్ రాజ్ ఈ సినిమాను నిర్మించటమే కాకుండా.. స్టోరి కూడా రాశారు. పుష్పక్,…
