(జనవరి 7న ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఏ రాజు 63వ జయంతి సందర్భంగా…) సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే పి.ఆర్.ఓగా సినీ కేరీర్ ని ఆరంభించిన బి.ఏ.రాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని, వంటి దిన, వార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట తన సతీమణి బి.జయ సహచర్యంతో 1994 లో ‘సూపర్ హిట్’ వార పత్రిక స్థాపించి, తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలం సృటించారు. ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా 27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు. కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా, అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు. సుమారు 1500…
