మంత్రి మ‌ల్లారెడ్డి చేతుల మీదుగా `C.I భార‌తి` షూటింగ్ ప్రారంభం!!

C.I Bharathi Telugu Movie opening

కింగ్ డ‌మ్ మూవీస్ ప‌తాకంపై ఘ‌ర్ష‌ణ శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మ‌ణారెడ్డి గ‌డ్డం ద‌ర్శ‌క‌త్వంలో విశాల ప‌సునూరి నిర్మిస్తోన్న చిత్రం `సిఐ భార‌తి`. న‌రేంద్ర, గ‌రిమా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సోమవారం హైద‌రాబాద్ లో ఈ చిత్రం ప్రారంభోత్స‌వం గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మ‌ల్లారెడ్డి స్క్పిప్ట్ అంద‌జేశారు. న‌టుడు అలీ తొలి స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మ‌ణారెడ్డి గ‌డ్డం మాట్లాడుతూ…“రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. సిఐ భార‌తి ఒక ప‌వ‌ర్ ఫుల్ స్టోరి. మంత్రి మ‌ల్లా రెడ్డి గారు, న‌టుడు అలీ గారు మా చిత్రం ప్రారంభోత్స‌వానికి రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం ఆవులు ప‌శుగ్రాసం లేక చెత్త కుప్ప‌ల ద‌గ్గ‌ర పేప‌ర్లు తినే ప‌రిస్థితి చూస్తున్నాం. దీని…