సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘విమానం’. జూన్ 9న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. శనివారం ఈ మూవీ సక్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్బంగా.. సముద్ర ఖని మాట్లాడుతూ ‘‘ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లే ఆ సినిమాను భుజాలపై మోస్తారు అని చెప్పటానికి ‘విమానం’ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. మరోసారి విమానంతో ప్రూవ్ అయ్యింది. జీ స్టూడియోస్ వారికి థాంక్స్. నా ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్.…
