టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉండడమే! గతంలో కృతిశెట్టి అయితే అలా ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు అదే కోవలోకి చెందిన మరో భామ శ్రీలీల! ‘పెళ్లి సందD’ నటించిన శ్రీలీలకు మంచి పేరొచ్చింది. చూడడానికి అందంగా కనిపించడంతో పాటు నటన, డాన్స్ లలో అదరగొట్టింది. ”కేవలం గ్లామర్‌ను నమ్ముకొని వెండితెరకు రాలేదు. నటనతోనూ ఆకట్టుకోవాలని అడుగుపెట్టాను” అంటోంది అందాలభామ శ్రీలీల. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన తాజా సినిమా ‘పెళ్లి సందD’లో తళుక్కున మెరిసిన బ్యూటీ. తొలి చిత్రంతోనే ఆమె అందరి మనసులను ..ముఖ్యంగా యువతరం హృదయాలను దోచేసింది. ఒకే ఒక్క సినిమాతోనే ఇంత పాపులా రిటీయా? అని అందరూ…
