దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికేట్ పొందిది. ఇప్పుడు మేకర్స్ బలగం సినిమాను మార్చి 3న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సినిమా నుంచి మూడో పాటను నేడు రిలీజ్ చేశారు. ఈ పాటను మామిడి హరికృష్ణ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ.. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు సినీ ప్రపంచంలో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఓ చక్కటి బతుకు చిత్రాన్ని తీయొచ్చని నిర్మించారు. ఇది గేమ్ చేంజర్ సినిమా అవుతుంది. ఇది అందరికీ…