ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై వి.జె.స‌న్నీ హీరోగా నూత‌న చిత్రం ప్రారంభం!!

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై వి.జె.స‌న్నీ హీరోగా నూత‌న చిత్రం ప్రారంభం!!

వినోద ప్ర‌ధాన‌మైన చిత్రాలు అందించాల‌న్న సంక‌ల్పంతో , అభిరుచితో టెక్సాస్ కు చెందిన ఫుల్ మూన్ ప్రొడక్షన్స్ అనే నూత‌న సంస్థ చలనచిత్ర ప్రపంచంలో సరికొత్త సంచ‌ల‌నాలు సృష్టించడానికి సిద్ధ‌మైంది. అందులో భాగంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తొలి ప్ర‌య‌త్నంగా బిగ్ బాస్ ఫేమ్ , ఏటియ‌మ్ వెబ్ సిరీస్ తో న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వి.జె.స‌న్నీ హీరోగా ఓ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 9న గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభించారు. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి మరియు రేఖ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. టాలెంటెడ్ రైట‌ర్ ‘సంజయ్’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వైవిధ్యమైన కథలను చిత్రీకరించడంలో పేరు పొందిన వి. జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా రూపొంద‌నుంది. ఈ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా…