ఫిబ్రవరి 10న ‘దేశంకోసం’ చిత్రం విడుదల

ఫిబ్రవరి 10న 'దేశంకోసం' చిత్రం విడుదల

రవీంద్ర గోపాల దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన చిత్రం ‘దేశం కోసం’. ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుని ఫిబ్రవరి 10న విడుదలకి సిద్ధంగా ఉంది. రవీంద్ర గోపాల్‌ ఈ సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు వేశాడు. ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. ఈ సినిమా తన కోసం కాదు.. దేశం కోసం చేసిన సినిమా’ అని అన్నారు. నేటి తరానికి గాంధీ, భగత్‌ సింగ్‌ అంటే ఎవరో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో మంది త్యాగఫలం మన స్వాతంత్య్రం అనే విషయం వారికి తెలియజేయడం ఈ చిత్ర కథాంశం. ఫిలిం ఛాంబర్‌ లో ఘనంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో…