గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి #NBK108 తో మాస్, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోనున్నారు. బాలకృష్ణ అభిమానులకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు కానుంది. ఎందుకంటే ఈ బర్త్ డే కి చాలా ట్రీట్‌లు ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)కి రెండు రోజుల ముందుగా అంటే జూన్ 8వ తేదీన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ చూసేందుకు మనం మరో మూడు రోజులు ఆగాలి. జూన్ 10న బాలకృష్ణ…
