‘ప్రేమ అనే నేను’ షూటింగ్ పూర్తి!!

ప్రేమ అనే నేను షూటింగ్ పూర్తి!!

వరల్డ్ ఫోక‌స్ పిక్చర్ ప‌తాకంపై ఆర్.కె బ్రోస్ సమర్పణలో బాసి ద‌ర్శ‌క‌త్వంలో బి.స‌తీష్ నిర్మిస్తోన్న చిత్రం `ప్రేమ అనే నేను`. ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుంది.   ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో నిర్మాత బి.స‌తీష్ మాట్లాడుతూ…` కొత్త ఆర్టిస్ట్ ల‌తో ఈ సినిమా చేశాం. కాకినాడ‌, ఉప్పాడ‌, మ‌చిలీప‌ట్నం, వైజాగ్ స‌ముద్ర ప్రాంతాల్లో చేశాం. టీమ్ అంతా చాలా బాగా స‌పోర్ట్ చేశారు.  మంచి కాన్సెప్ట్ తో వ‌చ్చే చిత్రాలను ఆద‌రిస్తున్నారు. మా చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నా“ అన్నారు. ద‌ర్శ‌కుడు బాసి మాట్లాడుతూ…“ సినిమా చాలా బాగా వ‌చ్చింది. మంచి కాన్సెప్ట్ తో వ‌స్తోన్న చిత్ర‌మిది“ అన్నారు.   క‌థానాయ‌కుడు ఆర్ కె బ్రోస్ మాట్లాడుతూ…“ఓ గ్రామీణ ప్రాంతంలో ఉండే కుర్రాడిగా న‌టించాను. ఆడిష‌న్ ద్వారా న‌న్ను హీరోగా తీసుకున్నారు.…