యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో సినిమా టీజర్ విడుదల చేశారు. అలాగే, మీడియా కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర బృందం మాట్లాడింది. హీరో కార్తికేయ మాట్లాడుతూ ”ష్యూర్ షాట్ హిట్ అయ్యే స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో క్లాక్స్ కలిశాడు. అతను తెలుసు. అయితే, ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా రిఫర్ చేయడంతో అతని కథ విన్నాను. స్క్రిప్ట్ విన్నాక ఇటువంటి కథ కోసమే వెయిట్ చేస్తున్నానని అనిపించింది. ఎటువంటి లెక్కలు వేసుకోకుండా ఈ కథ చెప్పాలని, ఈ కథలో…
