ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ NTR 30. గురువారం (మార్చి 23) ఈ సినిమా గ్రాండ్ లెవల్లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్టీఆర్ 30 లాంచింగ్ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్స్ ఎస్.ఎస్.రాజమౌళితో పాటు ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, ఏషియన్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, భరత్ చౌదరి, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి…
