ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతులుమీదుగా ‘వేద’ చిత్రం నుండి ‘పుష్ప పుష్ప..’ వీడియో సాంగ్ విడుదల

ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతులుమీదుగా 'వేద' చిత్రం నుండి 'పుష్ప పుష్ప..' వీడియో సాంగ్ విడుదల

ఫిబ్రవరి 9న విడుదల కాబోతున్న శివ రాజ్‌కుమార్ “వేద” ఇటివలే కార్తికేయ, ధమాక వంటి హిట్ చిత్రాలకు నిర్మాణ బాగస్వామైన వివేక్ కూచిబొట్ల కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రంలోని పాటను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్న డిసెంబర్ కన్నడలో రిలీజై మంచి విజయం సాధించిన “వేద” సినిమాను కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ గారు తెలుగు ప్రేక్షకులు అందిస్తున్నారు. ఈ పాట కూడా చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం అందుకుంటుందని భావిస్తున్నాను. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో. ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని…