ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం `రివెంజ్`. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ చేతుల మీదుగా లాంచైంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ…“రివెంజ్ ` చిత్ర దర్శకుడు శ్రీను నాకు మంచి మిత్రుడు. మద్రాస్ నుంచి ఇద్దరి జర్నీ ప్రారంభమైంది. తను మంచి రైటర్, దర్శకుడు. సినిమానే ప్రాణంగా బ్రతికే వ్యక్తి. ఈ సినిమాతో తనలో ఉన్న మరో కోణాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న బాబు గారిని ఒక మంచి నటుడుగా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు…
