‘మేమ్‌ ఫేమస్` టీజర్‌, పాటల ప్రదర్శన.. మే 26న చిత్రం విడుదల

‘మేమ్‌ ఫేమస్` టీజర్‌, పాటల ప్రదర్శన.. మే 26న చిత్రం విడుదల

సరికొత్త కథలతో, విభిన్నమైన సినిమాలు నిర్మించే ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్’. విడుదలైన టీజర్‌ మంచి ఆదరణ పొందింది. ఈసినిమా ప్రమోషన్‌ కు విజయ్‌దేవరకొండ, అనిల్‌ రావిపూడి,హరీష్ శంకర్, నాగచైతన్య వంటి ప్రముఖులు సపోర్ట్‌ గా నిలిచి సినిమా కు మరింత హైప్‌ క్రియేట్‌ చేశారు. ఇందులో నటించిన 35మంది కొత్తవారితో పాటు, సినిమా కంటెంట్‌ విడుదలకు ముందే ఫేమస్‌ అయిపోయింది. ఈ సందర్భంగా శనివారంనాడు మేమ్‌ ఫేమస్‌ చిత్ర యూనిట్‌ థావత్‌ అనే ప్రోగ్రామ్‌ తో ప్రసాద్‌ ల్యాబ్‌ లో నిర్వహించి టీజర్‌, రెండు పాటలను విలేఖరులకు ప్రదర్శించారు. చక్కటి సాహిత్యం తో కూడిన ‘అయ్యయో.. ఏమయింది గుండెల్లోన..’ పాట రాహుల్‌ సిప్లిగంజ్‌ గాత్రంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌,…